HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Mlc Kavitha Said Bjp Should Prove Its Sincerity By Passing The Womens Bill

MLC Kavitha: మహిళా బిల్లు పాస్ చేసి బీజేపీ తన చిత్త శుద్ది నిరూపించుకోవాలి

  • By Balu J Published Date - 11:12 AM, Sat - 12 August 23
  • daily-hunt
Kavitha
Kavitha

ఢిల్లీ: దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బిజెపి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” అనేపుస్తక ఆవిష్కరణ సభలో ఢిల్లీలో కవిత పాల్గొని మాట్లాడారు.

మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇండ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీల్లో కూడా అదే జరుగుతుందన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50 శాతం కాకుండా 33 శాతం రిజర్వేషన్ ఎందుకన్న చర్చ కూడా జరుగుతోందని, ఎక్కడో ఒక చోట అడుగుముందుకు పడాలని అన్నారు. అత్యధిక మెజారిటీ ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని, కేంద్రం ఆ రకంగా ఆలోచించడం లేదన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పెంచబోయే పార్లమెంటు సీట్లల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు.

కార్పొరేట్ రంగంలో మహిళలకు బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉందని, వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న దాదాపు 80 శాతం స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్ధతివ్వడం లేదని, బ్యాంకులు సహకరిస్తున్న వాటికి సంబంధించి కూడా పురుషుల వ్యాపారాలతో పోల్చితే మహిళలు చేస్తున్న వ్యా పారానికి తక్కువ నిధులు ఇస్తున్నాయన్నారు. ఏటాటే ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలకు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. దేశంలో 29 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నవారని, ఇలా అయితే దేశం వృద్ధి చెందలేదని, సమాజంలో మార్పురావాలి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని అడిగారు.

గ్రామాల్లో మహిళా సర్పంచ్లు ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేసు న్నారని, పన్నుల రూపంలో పంచాయతీలకు రాబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. భారత్ లో కంపల్సరీ ఓటింగ్ రావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచన చేశారు. పట్టణాలు నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • delhi
  • hard comments
  • MLC Kavitha

Related News

Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు

  • Nirmalabhatti

    Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

  • Yamuna River Levels

    Yamuna River Levels: ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. 207 మీటర్ల మార్కు దాటిన య‌మునా న‌ది నీటిమ‌ట్టం!

  • Kavitha

    Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

  • Kavitha to resign from MLC post.. Key press meet afterwards!

    Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !

Latest News

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd