MLC Kavitha: రేపు కాలినడకన తిరుమలకు కవిత
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు.
- By Hashtag U Published Date - 12:23 PM, Wed - 16 February 22
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు. గురువారం తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు కవిత. రేపు మధ్యాహ్నం మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.