HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavitha Hard Comment On Rahul Gandhi

Kavitha: రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారుః క‌ల్వ‌కుంట్ల క‌విత‌

  • Author : Balu J Date : 27-11-2023 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavithabrs
Kavithabrs

Kavitha: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టపు చూపులా బోధన్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మండిపడ్డారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా నిర్వహించిన రోడ్ షో లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ….“మూడు గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా లేదా 24 గంటలు కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? నిరంతరం నీళ్లు ఇచ్చే వాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? కర్నాటక డిప్యుటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వచ్చి ఐదు గంటల కరెంటే ఇస్తామని చెప్తున్నారు. ఐదు గంటల కరెంటు కావాలా లేదా 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ?” అన్న అంశాలపై ఆలోచన చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసినట్లు చేసిందని పేర్కొన్నారు. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోఫిటిషన్లు జారీ చేశామని, ప్రైవేటు రంగంలో 30 లక్షల ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు లేదని, పొలాలకు, తాగడానికి నీళ్లు ఇవ్వలేదని, మళ్లీ పొరపాటు చేస్తే పాత రోజుల్లో అనుభవించిన గతే పడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, పెన్షన్లు, కరెంటు పోతాయని, పిల్లలకు భవిష్యత్తు ఉండదని, చాలా దారుణమైన పరిస్థితి నెలకొంటుందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ల పాటు చూసిన దారుణ పరిస్థితిని చూశామని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచాలని, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం పేరిట నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తామని, రూ. 15 లక్షల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బంధు మొత్తం రూ. 16 వేలకు పెరుగుతుందని, ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కోరుట్లలో వెయ్యి ఫాట్లను ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహ లక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. బోధన్ లో షకీల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • BRS Kavitha
  • hard comments
  • rahul gandhi

Related News

Mahadev

TG Municipal : బీజేపీ మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య ! అధికార పార్టీ వేధింపులే కారణమా ?

మహాదేవ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు మరియు బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని వారు వాపోతున్నారు

    Latest News

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    • న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

    • అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd