MLC Kavitha : ముగిసిన కవిత ఈడీ విచారణ.. పదిన్నర గంటల పాటు కవితపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలకు పైగా ఈడీ
- By Prasad Published Date - 09:23 PM, Mon - 20 March 23

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈడీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సౌత్ గ్రూప్‌లో ఆర్థిక లావాదేవీలపై కవితను ఈడీ ప్రశ్నించారు. ఉదయం అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం నుంచి మనీష్ సిసోడియా, అరోరాతో కలిపి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.