Kavitha MLC: బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
కరీంనగర్ లోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు.
- Author : Balu J
Date : 11-02-2022 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
కరీంనగర్ లోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కరీంనగర్ లోని స్వయంభు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టం అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ అద్భుతంగా స్వామి వారి వేడుకలని నిర్వహిస్తున్నారని, ఇక్కడ కూడా తిరుపతి లో మాడ వీధులు ఉన్నట్టుగానే ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. స్వామి వారి అనుగ్రహం తెలంగాణ పై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.