MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగింపు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను
- By Hashtag U Published Date - 01:37 PM, Fri - 23 September 22
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనంతబాబు రిమాండ్ ను అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఫలితంగా తిరిగి ఎమ్మెల్సీని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మరోపక్క, హత్యకేసులో నిందితుడిగా వున్న ఆయనను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
Related News
Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.