RK Roja Visits Tirumala : మంత్రి రోజా కోరిక తీరిందా..? అందుకే శ్రీవారి దర్శనం చేసుకుందా..?
చంద్రబాబు జైలు కు వెళ్లారని మంత్రి రోజా మొక్కలు చెల్లించుకున్నట్లు ఉంది..ఆమె కోరిక కూడా చంద్రబాబు జైలు కు వెళ్లడం అనుకుంటా
- By Sudheer Published Date - 02:29 PM, Tue - 12 September 23

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు (AP Skill Development Scam) లో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ (Chandrababu Arrest) చేసింది సీఐడీ. ఈ కేసుకు సంబదించిన విచారణ జరిపిన ఏసీబీ కోర్ట్ (ACB Court) చంద్రబాబు కు రెండువారాల పాటు జైలు శిక్ష విధించింది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ కావడం..జైలు కు వెళ్లడం టీడీపీ పార్టీ శ్రేణులే కాకుండా యావత్ తెలుగు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఈ కేసు నుండి బయటకు రావాలంటూ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. మరోపక్క చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిసి ఆయన అభిమానులు , టీడిపి పార్టీ వీరాభిమానులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంతమంది ఆవేదనకు గురై, గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది కార్యకర్తలు మరణించారు.
ఇలా టీడీపీ పార్టీ శ్రేణులు బాధపడుతుంటే..వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు అరెస్ట్ కావడం తో సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా (Minister RK Roja) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలతో ఆమె సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ పంచుతూ..బాణా సంచా కాల్చారు. అంతే కాదు చంద్రబాబు ఇక ఎప్పటికి బయటకు రాలేడని , రానివ్వం అని ..ఈ ఒక్క కేస్ కాదు మరిన్ని కేసులు పెట్టబోతున్నామని హెచ్చరించారు. ఈరోజు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు (Roja Visits Tirumala Temple)చెల్లించుకున్నారు. స్వామి మొక్కులు చెల్లించుకోవడం తో చాలామంది చంద్రబాబు జైలు కు వెళ్లారని మంత్రి రోజా మొక్కులు చెల్లించుకున్నట్లు ఉంది..ఆమె కోరిక కూడా చంద్రబాబు జైలు కు వెళ్లడం అనుకుంటా..అందుకే ఆమె కోరిక ను శ్రీవారు తీర్చాడు కాబట్టే ఆమె మొక్కులు చెల్లించుకున్నట్లు ఉందని నెటిజనులు కామెంట్స్ పెడుతున్నారు.
Read Also : Video Viral: ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సెక్యూరిటీ.. వీడియో వైరల్?
ఇక దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయని, తప్పు చేసే చంద్రబాబుకి శిక్ష పడాలని రాష్ట్ర ప్రజలందరూ భగవంతుడిని ప్రార్థించారని, అందుకే చంద్రబాబు కటకటాల పాలయ్యారని ఆమె విమర్శించారు.. స్నేహ బేరక్ లో చంద్రబాబుకి ప్రత్యేక గదిని, అదేవిధంగా ఖైదీ నెంబర్ 7691 అనే నెంబర్ ని కేటాయించడం జరిగిందన్నారు. అంతే కాకుండా సీసీ కెమెరాల నిఘాలో చంద్రబాబుకి కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం చేశామన్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లడంతో బయట నారా లోకేష్, అచ్చం నాయుడు ( Nara Lokesh and Acham Naidu) ఓవరాక్షన్ చేస్తున్నారని, చంద్రబాబు ఎంత మందిని జైలుకు పంపాడో, ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో, ఎంతమంది ప్రాణాలు తీశాడో వారి ఉసురు చంద్రబాబుకి తగిలిందన్నారు.. చంద్రబాబుది అక్రమ కేసు కాదని అడ్డంగా దొరికిపోయిన కేసు అని ఆమె విమర్శించారు.