BRS Minister: ఎన్నికల ప్రచార పర్వం మొదలుపెట్టిన మంత్రి మహేందర్ రెడ్డి
- By Balu J Published Date - 08:18 PM, Mon - 16 October 23

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో
కొడంగల్ నియోజకవర్గం బొమ్మరస్పెట్ మండలం మదనపల్లి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరారు. మంత్రి మహేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి బాబయ్య, రమేష్, బాబు, శివకుమార్, అంజయ్య, ముద్దప్ప, నరేష్, గోపాల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ వాళ్లను నమ్మొద్దు ఎన్నికల అప్పుడు వస్తుంటారు పోతుంటారు. ఆరు గ్యారెంటీలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ముందు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పథకాలను అమలు చేయాలి. కెసిఆర్ ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రతిపక్షాల వెన్నుల్లో వణుకు పుడుతుంది. దేశంలో ఎక్కడలేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ముచ్చటగా మూడోసారి సీఎంగా కేసీఆర్, రెండోసారి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని మహేందర్ రెడ్డి అన్నారు.