HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Minister Ktr Visited Flood Areas In Hyderabad

KTR: హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు.

  • Author : Balu J Date : 27-07-2023 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1112414 Ktr News
1112414 Ktr News

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావిత పట్టణాల్లో ఉన్న పరిస్థితులపైన పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

కేటీఆర్ మీడియాతో మాట్లాడిన కొన్ని ముఖ్యాంశాలు:

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు
పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు
వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతాం
శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలి
హైదరాబాద్ నగరంలోనూ జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారు
పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేయడం జరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నాం
ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం పడడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నది
మా ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమే. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది
హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది
హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాము. దీంతోపాటు చెరువులను బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు, సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు
గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవి. అయితే ఈసారి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (SNDP ) ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గింది
ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నది
ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని… భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి
భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్ష ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం పెంచేలా నాయకులు మాట్లాడితే బాగుంటుంది
వరద పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం
గండి పడే ప్రమాదం ఉన్న చెరువులను సమీక్షిస్తున్నాం. మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం
వర్షాలు తగ్గుముఖం పట్టగానే అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం
వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరాన్ని బట్టి రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flood damage
  • heavy rains in hyderabad
  • ktr

Related News

KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • కేసీఆర్ కు మరోసారి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం – భట్టి

  • రేవంత్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు!

  • శారీరక బలహీనతను తరిమికొట్టే అద్భుత చిట్కా ఇదే!

  • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

  • దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీల‌క అంశాలీవే!

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd