KTR: తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్’కు చోటు లేదు: మంత్రి కేటీఆర్
- By Balu J Published Date - 05:59 PM, Fri - 13 October 23

ఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో ఓ వ్యాపారి ఇంట్లో రూ.40 కోట్ల నగదు దొరికిన ఘటనపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దివాళా తీసిన కాంగ్రెస్ తెలంగాణలో ఓట్ల కొనుగోలు కోసం కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలను పంపిస్తోందంటూ ఘాటుగా స్పందించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన పీసీసీ చీఫ్, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్’కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో
తెలంగాణా ఆరోగ్య మంత్రి హరీష్ రావు కూడా కర్ణాటక కాంగ్రెస్‌ను దూషించారు. నోట్ల కట్టలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టలేరని ఆయన అన్నారు. కాగా 119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభకు నవంబర్ 30, 2023న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. అభ్యర్థి నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 10. పైగా, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ నవంబర్ 15. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది.