KTR On Screen: వెండితెరకు మరో డైనమిక్ హీరో!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు టాలీవుడ్ తో మంచి సత్సంబంధాలున్నాయి. మెగా హీరో రాంచరణ్, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిలతో స్నేహం ఉంది.
- By Balu J Updated On - 10:20 AM, Fri - 24 June 22

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు టాలీవుడ్ తో మంచి సత్సంబంధాలున్నాయి. మెగా హీరో రాంచరణ్, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిలతో స్నేహం ఉంది. వీరేకాకుండా ఇతర హీరోహీరోయిన్లు కూడా ఆయనకు టచ్ లో ఉంటారు. అందుకే తరచుగా కేటీఆర్ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాను త్వరలో ఓ సినిమాలో నటించనున్నట్టు కేటీఆర్ స్పస్టం చేశారు. మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రిప్లై ఇస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అటు ఐటీ మంత్రిగా, ఇటు మున్సిపల్ శాఖ మంత్రిగా బిజీ బిజీగా ఉండే కేటీఆర్ తనదైన స్టయిల్ లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటారు. తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పర్చుకున్నాడు. టాలీవుడ్ హీరోలు సైతం కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ కేటీఆర్ కెమెరా ముందుకు రాబోతున్నారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రిప్లై ట్వీట్ లో కేటీఆర్ కూడా సరదాగా కామెంట్స్ చేశారు. తప్పకుండా కెమెరా ముందుకు వస్తానన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ కోసం మరిన్ని పెట్టుబడులు పెడితే కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన యాడ్ లో నటిస్తానంటూ కేటీఆర్ తెలిపారు.
You are a phenomenal brand ambassador, @KTRTRS , no doubt about that. My only concern is that you may be stolen by the skyrocketing Tollywood empire! 😊 https://t.co/Yz4gIbpYof
— anand mahindra (@anandmahindra) June 22, 2022
Related News

Reddy Corporation : తెలంగాణలో రెడ్డి కార్పొరేషన్
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం అగ్రస్థానంలో ఉందని, అందులో పేదలు కూడా ఉన్నారని అభిప్రాయపడ్డారు.