Minister Gangula: వినాయక మండపాలకు మంత్రి గంగుల 4 లక్షలు అందజేత
గంగుల కమలాకర్ తన సొంత నిధులు 4 లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ అధికారులకు అందజేశారు.
- Author : Balu J
Date : 22-09-2023 - 3:19 IST
Published By : Hashtagu Telugu Desk
కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాలకు అవసరమైన కరెంట్ కోసం మంత్రి గంగుల కమలాకర్ తన సొంత నిధులు 4 లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ అధికారులకు అందజేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినాయక మండపాలకు విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలోఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశం నిర్వహించి, 4లక్షల చెక్ ని అందజేసారు.
గత కొన్నేళ్లుగా సొంత నిధులతో మంత్రి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతియేటా వినాయక చవితి నవ రాత్రి ఉత్సవాలకు విద్యుత్ బిల్లులు తానే చెల్లిస్తున్నాని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేశారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు.. సురక్షితమైన ,నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనిఅధికారులకు సూచించారు.
వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని. అన్నారు. మండపాల వద్ద సురక్షితమై విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. వినాయక మండప నిర్వాహకులను కరెంటు బిల్ పేరుతో ఇబ్బందులకు గురి చేయద్దని ..వినాయక మంటపనిర్వాకులు విద్యుత్ అధికారులకు సహకరించాలని స్పష్టంచేశారు.