Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య
- Author : Prasad
Date : 02-06-2026 - 11:36 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోందని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత.. ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులను ఆ లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా.. సూసైడ్ నోట్‌లోని విషయాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.