200 People Missing : 200 మందితో బయలుదేరిన బోటు గల్లంతు.. ఏమైంది ?
200 People Missing : సెనెగల్ దేశంలోని కఫౌంటైన్ నుంచి 200 మంది ఆఫ్రికా వలసదారులతో బయలుదేరిన ఫిషింగ్ బోటు గల్లంతైంది.
- Author : Pasha
Date : 10-07-2023 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
200 People Missing : సెనెగల్ దేశంలోని కఫౌంటైన్ నుంచి 200 మంది ఆఫ్రికా వలసదారులతో బయలుదేరిన ఫిషింగ్ బోటు గల్లంతైంది. స్పెయిన్ లోని కానరీ దీవుల సమీపంలో మిస్సయ్యింది. స్పెయిన్ రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు ఆ బోటు జాడ కోసం కానరీ దీవుల జలాల్లో వెతుకుతున్నాయి. చాలామంది పిల్లలు కూడా ఆ బోటులో ఉన్నారని రెస్క్యూ టీమ్ చెబుతోంది. ఈ ఫిషింగ్ బోటు దాదాపు 200 మందితో జూన్ 27న కఫౌంటైన్ నుంచి కానరీ దీవులకు బయలుదేరిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరో రెండు బోట్లు కూడా కానరీ దీవుల జలాల్లో మునిగిపోయాయని(200 People Missing) పేర్కొంటూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
Also read : 119 Years Later : 119 ఏళ్ల క్రితం తీసుకెళ్లిన బుక్ లైబ్రరీకి తిరిగొచ్చింది
ఆ రెండు పడవల్లో .. ఒకదానిలో 65 మంది, మరొక దానిలో 60 మంది ఉన్నారని పేర్కొంది. దీనివల్ల గల్లంతైన మొత్తం 3 పడవల్లో తప్పిపోయిన వారి సంఖ్య 300 దాటిందని తెలిపింది. పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి స్పెయిన్ లోని కానరీ దీవులకు వలసదారులు ఫిషింగ్ బోట్లలో అక్రమంగా వలస వస్తుంటారు. ఇది ఎంతో ప్రమాదకరమైన ప్రయాణం. శక్తివంతమైన అట్లాంటిక్ సముద్ర ప్రవాహాలను తట్టుకునే కెపాసిటీ సాధారణ ఫిషింగ్ బోట్లకు ఉండదు. అందుకే ఓవర్ లోడ్ అయి ఉండే ఫిషింగ్ బోట్లు తరుచుగా అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోతుంటాయి.