HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Megastar Chiranjeevi In Modi Cabinet

Megastar Chiranjeevi : మోడీ కేబినెట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి..?

చిరుని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.

  • Author : Latha Suma Date : 14-01-2025 - 2:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Megastar Chiranjeevi in ​​Modi cabinet..?
Megastar Chiranjeevi in ​​Modi cabinet..?

Megastar Chiranjeevi : త్వరలోనే మోడీ కేబినెట్‌లో మెగాస్టార్ చిరంజీవి మంత్రి కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. 2025 జూన్ లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి చిరంజీవికి కేటాయించే అవకాశం ఉందని కాషాయ పార్టీ వర్గాల సమాచారం. చిరుని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ లోనే ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కాపులందరూ ఓట్లేయకపోయినా పోలైన సుమారు 70 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే.

నిన్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఢిల్లీలో త‌న నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీతో పాటుగా జాతీయ స్థాయిలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్రధానిమోడీకి కిష‌న్‌రెడ్డితో పాటుగా చిరంజీవి సాగర స్వాగతం పలికారు. దీంతో చిరంజీవి బీజేపీకి చాలా దగ్గరవుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఘనంగా జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ ఉత్సవాలు జరిగాయి. బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు కూడా హాజరయ్యారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి పై ఈ ప్రచారం కొత్తేమీ కాదు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార సభకు మోడీ, చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ వేదికపై ప్రధాని మోడీ, (చిరంజీవి, పవన్‌) ఇద్దరిని చెరో పక్కన ఉంచుకుని వారి చేతులు పైకి లేపి విజయ సంకేతాన్ని జనాలకు చూపించారు. దీంతో అప్పటినుంచి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు.. మోడీ కేబినెట్ లో మంత్రిగా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. దీనికి తోడు కేంద్రం చిరంజీవిని అత్యున్నత పురస్కారంతో సత్కరించడంతో ఆ వార్తలకు మరింత ఊపందుకుంది.

Read Also: National Turmeric Board : పసుపు బోర్డు ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Kapus Votes
  • megastar chiranjeevi
  • Modi Cabinet
  • pm modi
  • Rajya Sabha Seats

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

    Latest News

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd