Medaram Invitation: సీఎంగారూ.. మేడారం జాతరకు రండి!
దేశంలోనే అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానున్నసంగతి తెలిసిందే.
- Author : Balu J
Date : 08-02-2022 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలోనే అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానున్నసంగతి తెలిసిందే. ఈ మేరకు జాతర ఉత్సవాలకు హాజరుకావాలని తెలంగాణ మంత్రులు సీఎం కేసీఆర్ కు ఆహ్వాన ప్రతికను అందించారు. మంగళవారం ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రికి స్వయంగా అందజేశారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ మూడు వేలకుపైగా బస్సులు నడపనుంది. సీఎం కేసీఆర్ ను కలిసినవాళ్లలో సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ నాయకులు ఉన్నారు.