Mayawati Supports UCC : యూసీసీకి మేం వ్యతిరేకం కాదు : మాయావతి
Mayawati Supports UCC : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 11:56 AM, Sun - 2 July 23
Mayawati Supports UCC : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. “యూనిఫాం సివిల్ కోడ్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది. కానీ దాన్ని అమల్లోకి తెచ్చేటందుకు బీజేపీ సర్కారు అనుసరిస్తున్న పద్ధతిని రాజ్యాంగం సమర్థించదు. యూసీసీకి సంబంధించిన అన్ని కోణాలను బీజేపీ పరిశీలించాలి’’ అని బీఎస్పీ చీఫ్ అన్నారు.
Also read : Guru Purnima 2023 : జులై 3న గురు పౌర్ణమి.. జీవితానికి వెలుగులిచ్చే రోజు
#WATCH | On the Uniform Civil Code, BSP national president Mayawati, says "Our party (BSP) is not against the implementation of UCC but we do not support the way BJP is trying to implement Uniform Civil Code in the country. It is not right to politicise this issue and forcefully… pic.twitter.com/PzVXgVEneG
— ANI (@ANI) July 2, 2023
“మా పార్టీ (బీఎస్పీ) యూసీసీ అమలుకు వ్యతిరేకం కాదు.. అయితే దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విధానాన్ని మేము సమర్థించం. యూసీసీని రాజకీయం చేసి దేశంలో బలవంతంగా అమలు చేయడం సరికాదు” అని మాయావతి పేర్కొన్నారు. అన్ని విషయాల్లో అన్ని మతాల వారికి ఒకే చట్టాన్ని వర్తింపజేస్తే.. అది దేశాన్ని బలోపేతం చేస్తుందన్నారు. జూలై 3న(సోమవారం) యూనిఫాం సివిల్ కోడ్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చ జరగడానికి ముందు మాయావతి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపి.. ప్రజా సంఘాలు, మత సంఘాల అభిప్రాయాలను సేకరిస్తారని తెలుస్తోంది.
Related News
Lok Sabha Elections : RS ప్రవీణ్ కుమార్‌కు భారీ షాక్ తగలబోతుందా..?
నిన్నటి వరకు నాగర్ కర్నూల్ లో తనదే విజయం అని ధీమా గా ఉన్నారు. ఎందుకంటే ఇటు bsp శ్రేణులతో పాటు అటు బిఆర్ఎస్ శ్రేణులు తనకు మద్దతు ఇస్తారని..తనకే ఓటు వేస్తారని..దీంతో విజయం తనదే అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారీ షాక్ తగిలింది.