Guru Purnima 2023 : జులై 3న గురు పౌర్ణమి.. జీవితానికి వెలుగులిచ్చే రోజు
Guru Purnima 2023 : జులై 3న(సోమవారం) గురు పౌర్ణమి.. గురు పౌర్ణమి రోజున గురువుని పూజించే గొప్ప సంప్రదాయం ఉంది.
- By Pasha Published Date - 10:47 AM, Sun - 2 July 23

Guru Purnima 2023 : జులై 3న(సోమవారం) గురు పౌర్ణమి..
గురు పౌర్ణమి రోజున గురువుని పూజించే గొప్ప సంప్రదాయం ఉంది.
ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
తెలుగు క్యాలెండర్ ప్రకారం నాలుగో నెల ఆషాఢ మాసం. ఈ మాసంలో చేసే పూజ, పారాయణ, తపస్సులను ఫలవంతమైనవిగా పరిగణిస్తారు. ఆషాఢ మాసంలో దుర్గామాత, శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్ర దేవతలను పూజించే ఆచారం ఉంది. గురు పౌర్ణమి రోజున శ్రీ హరిని, వ్యాస భగవానుడిని, గురువుని పూజించే సాంప్రదాయం ఉంది. గురుపౌర్ణమి రోజున గురువులను పూజిస్తే కూడా గురు బలం పెరుగుతుంది. ఆ రోజున గురువును భోజనానికి ఆహ్వానించి, మంచి భోజనం పెట్టి ఆతిధ్యం ఇచ్చి, ఆయనకు దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందడం ద్వారా కూడా గురు గ్రహం బలపడుతుంది. ఫలితంగా వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ ఏడాది గురు పౌర్ణమి (Guru Purnima 2023) జూలై 3న వచ్చింది. ఈ రోజున శుభ ఫలితాలను పొందడానికి ప్రత్యేకంగా పూజలు, జపం, తపస్సు, దానం మొదలైనవి చేయాలి. గురు పూర్ణమి రోజున నియమాలు, నిబంధనల ప్రకారం చంద్రుడిని పూజించాలి. ఏ కారణం చేతనైనా మీకు మానసిక అశాంతి ఉంటే.. గురు పూర్ణిమ తిథి నాడు చంద్రునికి నీరు, పాలు సమర్పించాలి. తద్వారా అన్ని రకాల మానసిక చింతల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
Also read : Aliens Day : నేడే “ఏలియన్స్ డే”.. స్పెషాలిటీ తెలుసా ?
దానం చేయాల్సిన వస్తువులు
హిందూ విశ్వాసం ప్రకారం.. గురు పూర్ణిమ రోజున అమ్మవారి అనుగ్రహం కోసం ఆహారం, బట్టలు, డబ్బు మొదలైన వాటిని దానం చేయాలి. ఆర్ధిక ఇబందులు ఎదురైతే బియ్యం పాయసం చేసి పేద ప్రజలకు పంచాలి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కురుస్తుందని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
వ్యాపారంలో పురోగతి కోసం..
గురు పౌర్ణమి నాడు పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పండ్లు, స్వీట్ లు, కుంకుమ పువ్వు, నెయ్యి, ఇత్తడి సామాను దానం చేయడం వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది. ఇక ఈశాన్య దిక్కు గురు గ్రహానికి సంబంధించింది కావడంతో, గురు పౌర్ణమి రోజున ఈశాన్య దిక్కును శుభ్రపరిచి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా వ్యాపారంలో పురోగతి సాధ్యమవుతుంది.