Moon Landing Vs Mars Landing : మూన్ ల్యాండింగ్ ఈజీనా ? మార్స్ ల్యాండింగ్ ఈజీనా ?
Moon Landing Vs Mars Landing : ఈరోజు చంద్రయాన్-3 ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు మోపనున్న చారిత్రక రోజు. అన్నీ అనుకూలిస్తే.. ఇవాళ (ఆగస్టు 23) సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు చంద్రయాన్-3 ల్యాండర్ "విక్రమ్" జాబిల్లిపై సేఫ్ గా ల్యాండ్ అవుతుంది.
- By Pasha Published Date - 08:43 AM, Wed - 23 August 23
Moon Landing Vs Mars Landing : ఈరోజు చంద్రయాన్-3 ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు మోపనున్న చారిత్రక రోజు.
అన్నీ అనుకూలిస్తే.. ఇవాళ (ఆగస్టు 23) సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” జాబిల్లిపై సేఫ్ గా ల్యాండ్ అవుతుంది.
ఈ తరుణంలో ల్యాండర్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయించడం ఈజీనా ? అంగారక గ్రహం (మార్స్) పై ల్యాండ్ చేయించడం ఈజీనా ?
ల్యాండింగ్ నిర్వహించే క్రమంలో.. చంద్రుడిపై ఎదురయ్యే ఛాలెంజెస్ ఏమిటి ? అంగారకుడిపై ఏర్పడే సవాళ్లు ఏమిటి ?
ఇది తెలుసుకునే ముందు.. ఇతర గ్రహాలపై ల్యాండ్ అయ్యే దాన్ని “ల్యాండర్” అంటారని మనం తెలుసుకోవాలి !!
ల్యాండర్ దిగగానే .. అందులో నుంచి రోబోటిక్ “రోవర్” బయటికి వస్తుంది.. అది ఆ గ్రహంపై తిరుగుతూ రీసెర్చ్ చేస్తుంది.
Also read : Today Horoscope : ఆగస్టు 23 బుధవారం రాశి ఫలితాలు.. వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు
మొదటి ల్యాండింగ్స్
ప్రపంచ దేశాలు ల్యాండింగ్ కు, రీసెర్చ్ కు యత్నిస్తున్న గ్రహాలు రెండు.. చంద్రుడు, అంగారకుడు!! చంద్రుడిపై తొలిసారిగా మనిషి ల్యాండింగ్ 1969 జులైలోనే జరిగింది. ఆ మిషన్ ను అప్పట్లోనే అమెరికాకు చెందిన నాసా (NASA) సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇద్దరు వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి దింపింది. ఇక అంగారకుడిపై తొలిసారి అడుగుపెట్టిన దేశం రష్యా. 1971 మే నెలలో రష్యాకు చెందిన “మార్స్ 3” ల్యాండర్ అంగారకుడిపై అడుగు మోపింది.
దూరం వర్సెస్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ?
దూరం విషయానికి వస్తే.. భూమి నుంచి 22.5 కోట్ల కిలో మీటర్ల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అందువల్ల అక్కడికి మన స్పేస్ క్రాఫ్ట్ చేరుకోవడానికి సగటున 7 నెలల టైం పడుతుంది. భూమి నుంచి కేవలం 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలోనే చంద్రుడు ఉన్నాడు. అందువల్ల అక్కడికి మన స్పేస్ క్రాఫ్ట్ చేరుకోవడానికి పది రోజులు లేదా రెండు వారాల టైం మాత్రమే పడుతుంది. భూమి నుంచి దూరం పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ సిగ్నల్స్ కు సంబంధించిన సమస్యలు అంతగా పెరుగుతాయి. చంద్రుడు దగ్గరగా ఉండటం వల్ల భూమి నుంచి అక్కడికి సిగ్నల్స్ పంపడం చాలా ఈజీ. భూమి నుంచి సిగ్నల్ పంపితే చంద్రుడికి అది చేరడానికి 1.3 సెకన్ల టైం మాత్రమే పడుతుంది. కానీ భూమి నుంచి అంగారకుడికి సిగ్నల్ పంపితే చేరడానికి దాదాపు 20 నిమిషాల టైం పడుతుంది.
Also read : Sachin Tendulkar: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్.. నేడు ఒప్పందం కుదుర్చుకోనున్న ఈసీ
వాతావరణం రెండు చోట్లా వెరీ డిఫరెంట్
చంద్రునిపై వాతావరణం లేదు. ఇది అక్కడ రీసెర్చ్ చేయడానికి ప్లస్ పాయింట్. అయితే చంద్రునిపై ఒక్క రాత్రి.. మన భూమికి చెందిన 13.50 రోజులకు సమానం. రాత్రి వేళ చంద్రునిపై -200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది. 13.50 రోజులకు సమానమైన తీవ్ర చలి వాతావరణాన్ని తట్టుకునేలా ల్యాండర్ , రోవర్ ఉండాలి. అందుకే వీటి లోపల థర్మల్ కంట్రోల్ టెక్నాలజీని అమరుస్తారు. చంద్రుడిలా కాకుండా.. అంగారక గ్రహానికి వాతావరణం ఉంది. అక్కడ గంటకు 100 కి.మీ వేగంతో భారీ దుమ్ము తుఫానులు సంభవిస్తుంటాయి. వీటిని తట్టుకునేలా ల్యాండర్, రోవర్ ఉండాలి. అంగారకుడు .. సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉంటాడు. కాబట్టి సూర్యరశ్మిని పొందేందుకు అంగారకుడి పై తిరిగే రోవర్లు పెద్ద రెక్కలను కలిగి ఉండాలి. దుమ్ము తుఫానులు ముంచెత్తినప్పుడు రోవర్లు దుమ్ములో కూరుకుపోతాయి. ఇలాంటి టైం లో అవి స్వీకరించే సూర్యరశ్మి గణనీయంగా పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దుమ్ము తుఫాను దాటిపోయే వరకు రోవర్లు వేచి ఉండటానికి “స్లీప్ మోడ్” అవసరం.
ఇప్పటివరకు మనిషి అంగారకుడు, చంద్రుడిపైకి పంపిన స్పేస్ మిషన్ల సక్సెస్ రేటును పోల్చి చూస్తే.. ఎక్కువ సక్సెస్ రేటు చంద్రుడిపైనే(Moon Landing Vs Mars Landing) ఉంది. అంగారక గ్రహంపైకి పంపిన స్పేస్ మిషన్స్ 40 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. చంద్రుడి విషయంలో ఈ సక్సెస్ రేటు చాలా ఎక్కువ. అందుకే మార్స్ ల్యాండింగ్ తో పోల్చుకుంటే మూన్ ల్యాండింగ్ ఈజీ!!
Related News
Japan On Moon : జపాన్ సక్సెస్.. చంద్రుడిపై దిగిన ల్యాండర్.. ఆ ప్రాబ్లమ్‌తో టెన్షన్
Japan On Moon : అమెరికా, రష్యా, చైనా, భారతదేశం తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది.