Meiteis Airlift : మిజోరాం టు మణిపూర్.. మైతైల ఎయిర్ లిఫ్ట్.. ఎందుకు ?
Meiteis Airlift : మణిపూర్ లోని మైతై వర్గానికి చెందిన వేలాదిమంది శరణార్థులు మిజోరాంలోని సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.
- Author : Pasha
Date : 23-07-2023 - 5:08 IST
Published By : Hashtagu Telugu Desk
Meiteis Airlift : మణిపూర్ లోని మైతై వర్గానికి చెందిన వేలాదిమంది శరణార్థులు మిజోరాంలోని సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారికి అక్కడ కూడా భద్రత లభించే పరిస్థితి కనిపించడం లేదు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మైతై వర్గానికి చెందిన పలువురు మూకలు నగ్నంగా ఊరేగించిన ఘటన గురించి తెలిసినప్పటి నుంచి మిజోరాంలో ఆశ్రయం పొందుతున్న మైతైలకు వార్నింగ్స్ రావడం మొదలైంది. భద్రంగా ఉండాలంటే మిజోరాంను విడిచి వెళ్లిపోండి అంటూ “పీస్ అకార్డ్ మిజో నేషనల్ ఫ్రంట్ రిటర్నీస్ అసోసియేషన్” (పామ్రా) అనే సంస్థ మైతైలను హెచ్చరించింది. పామ్రా సంస్థ ఒకప్పుడు మిజో నేషనల్ ఫ్రంట్ లో మిలిటెంట్ విభాగంగా ఉండేది.
Also read : BYJU’s : మరోసారి బైజూస్ కాంట్రాక్ట్‌పై ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు సంధించిన జనసేనాని
అయితే దీనిపై స్పందించిన మిజోరాం ప్రభుత్వం.. పూర్తి భద్రత కల్పిస్తామని మైతై శరణార్ధులకు భరోసా ఇచ్చింది. భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. అయినా 65 మంది మైతై శరణార్ధులు శనివారం ఐజ్వాల్ నుంచి విమానంలో మణిపూర్‌కు వెళ్లిపోయారు. సోమవారం కూడా ఇంకొంత మంది వెళ్లిపోనున్నారు. ఈనేపథ్యంలో మిజోరాంలో ఉన్న మైతై శరణార్ధులను ప్రత్యేక ట్రాన్స్ పోర్ట్ విమానాల్లో సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు(Meiteis Airlift) మణిపూర్ రాష్ట్ర సర్కారు రెడీ అవుతోంది.
Also read : Russia: ఒడెస్సా నగరంలో చర్చిని నేలమట్టం చేసిన రష్యా.. ఉక్రెయిన్ పై ఆగని దాడులు?