HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Overnight Russian Strikes On Odesa Caused Significant Structural Damage

Russia: ఒడెస్సా నగరంలో చర్చిని నేలమట్టం చేసిన రష్యా.. ఉక్రెయిన్ పై ఆగని దాడులు?

ఉక్రెయిన్‌, రష్యా మధ్య దాడులు ప్రతి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌ దేశంపై రష్యా వరుసగా దాడులు నిర్వహిస్తూనే ఉంది. కాగా ఇప్పటిక

  • By Anshu Published Date - 04:55 PM, Sun - 23 July 23
  • daily-hunt
Russia
Russia

ఉక్రెయిన్‌, రష్యా మధ్య దాడులు ప్రతి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌ దేశంపై రష్యా వరుసగా దాడులు నిర్వహిస్తూనే ఉంది. కాగా ఇప్పటికే రష్యా దాడిలో ఉక్రెయిన్‌ లో భారీగా ప్రాణం నష్టం ఆస్తి నష్టం నెలకొన్న తెలిసిందే. అయినా కూడా రష్యా,ఉక్రెయిన్‌ పై దాడులు మాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉక్రెయిన్‌ లోని ఒడెస్సా నగరంలో ప్రముఖ చర్చిని రష్యా నేలమట్టం చేసింది. తాజాగా ఉక్రెయిన్‌ నగరంపై జరిగిన దాడుల్లో పురాతన చర్చితో సహా ఆరు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఈ చర్చి దేశంలోని ప్రముఖ నిర్మాణ చిహ్నాల్లో ఒకటని ఉక్రెయిన్‌ దక్షిణ ఆపరేషనల్‌ కమాండ్‌ పేర్కొంది.

డజన్ల కొద్దీ కార్లు, అనేక భవనాల ద్వారాలు, కిటికీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అని ఆ కమాండ్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పేర్కొంది. రష్యా దాడుల కారణంగా నగరంలో విద్యుత్తు, ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపింది. అంతేకాకుండా పలు ప్రజారవాణా వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. తాజాగా దాడి జరిగిన చర్చి ఒడెస్సాలోనే అతి పెద్దది. దీనిని 1809లో వినియోగంలోకి తీసుకొచ్చారు. 1939లో సోవియట్‌ యూనియన్‌ దీనిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత 2003లో పునరుద్ధరించారు. తాజాగా జరిగిన దాడిలో చర్చ బాగా దెబ్బతిందని తెలుస్తోంది.

అయితే ఒడెస్సాల్లోని సాంస్కృతిక నిర్మాణాలపై దాడులు చేయవద్దని ఐరాసకు చెందిన యునెస్కో రష్యాకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, మాస్కో మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు. తాజాగా ఒడెస్సాపై దాడికి ఐదు రకాల క్షిపణులను వాడినట్లు ఉక్రెయిన్‌ చెబుతోంది. తాజాగా శనివారం రాత్రి జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ తెలిపింది. వీరిలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. గత వారం నుంచి రష్యా దళాలు దాడులను తీవ్రం చేయడంతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా చాలావరకు దాడులను నల్లసముద్రం పై నుంచి చేస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి మరిన్ని క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని కోరుతోంది. గత సోమవారం ఐరాస మద్దతు ఉన్న ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి రష్యా వైదొలగిన నాటి నుంచి ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేసింది. గత వారం నుంచి రష్యా దాడుల్లో దాదాపు 60,000 టన్నుల ధాన్యాలు ధ్వంసం అయ్యాయి. ప్రపంచ దేశాలకు ధాన్యం రవాణాలో ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు చాలా కీలకమైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • damage chruch
  • Odesa
  • russia
  • structural damage
  • ukraine

Related News

PM Modi Degree

Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్‌ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.

  • Indian refineries defy US threats

    Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు

  • Vladimir Putin

    Vladimir Putin : ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd