Loan APP Harassment : ఆగని లోన్ యాప్ ఆగడాలు.. ఏపీలో మరో యువకుడు బలి
ఏపీలో లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. లోన్ యాప్‌లకు బలైన దంపతుల ఘటన...
- Author : Prasad
Date : 09-09-2022 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. లోన్ యాప్‌లకు బలైన దంపతుల ఘటన మరువక ముందే ఏపీలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో శివరాత్ని శివ(20) అనే యువకుడు రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా రూ. 8వేలు తీసుకోగా.. రూ. 24 వేలు కట్టాలని నిర్వాహకులు ఒత్తిళ్లు చేశారు. దీంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.