Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు.బెదిరింపులకు పాల్పడిన యువకుడు అరిహంత్‌ను అరెస్ట్ చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయాడు
- By Praveen Aluthuru Published Date - 10:10 PM, Wed - 14 August 24

Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం అహ్మదాబాద్‌లో బాంబు పేలుడు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని క్రైం బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడిని కంకారియా నివాసి అరిహంత్‌గా గుర్తించారు. సమాచారం ప్రకారం అరిహంత్ అహ్మదాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బాంబు పేలుస్తామని బెదిరించాడు. కాల్ డిటేల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడిని కుబేర్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
బెదిరింపులకు పాల్పడిన యువకుడు అరిహంత్‌ను అరెస్ట్ చేసినట్లు క్రైం బ్రాంచ్ ఏఎస్పీ భరత్ పటేల్ తెలిపారు. చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయాడు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి నిందితుడిని సర్దార్ నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
నిందితులు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి స్వాతంత్య్ర దినోత్సవం రోజు బాంబు పేలుడు చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి ఎక్కడ పేలుతుందో ఫోన్‌లో చెప్పలేదు. బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసి కొన్ని గంటల్లో అరెస్టు చేశారు.
Also Read: Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు