Mamata Banerjee: కారు ప్రమాదంలో గాయపడిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తృటిలో తప్పించుకున్నారు. ఆమె ఈ రోజు కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో తలపై స్వల్ప గాయమైందని చెబుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:21 PM, Wed - 24 January 24

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తృటిలో తప్పించుకున్నారు. ఆమె కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో తలపై స్వల్ప గాయమైందని చెబుతున్నారు. నివేదికల ప్రకారం కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం తూర్పు బర్ధమాన్‌లోని గోదర్ మైదాన్‌లో మమత సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కోల్‌కతాకు తిరుగు ప్రయాణమయ్యేందుకు కారు ఎక్కారు. సభాస్థలి నుంచి జీటీ రోడ్డు ఎక్కుతుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ముఖ్యమంత్రి నుదిటిపై గాయమైంది. అయితే మమత కారు ఆపకుండా నేరుగా కోల్‌కతా వెళ్లిపోయింది. వాతావరణం సహకరించకపోవడంతో కోల్కతాకు హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన సీఎం మమతా రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా కాన్వాయ్ ఆగిపోయింది.రు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ముఖ్యమంత్రి గాయపడ్డారు.నుదిటిపై స్వల్ప గాయమైంది.
Also Read: Tea and Coffee : రాత్రిపూట కాఫీ, టీ లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్తగా మీరు డేంజర్ లో పడ్డట్టే?