13 Killed : మహారాష్ట్ర లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా.. 100
- By Prasad Published Date - 11:05 AM, Fri - 21 July 23

మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా.. 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అయ్యే ఖర్చును మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన పర్వత శిఖరానికి చేరుకోవడానికి నిపుణులైన ట్రెక్కర్లను పిలిపించారు. దాదాపు 46 ఇళ్లపై కొండచరియలు విరిగిపడగా, 20కి పైగా ఇళ్లు బురదలో మునిగిపోయాయి. కొండచరియలు విరిగిపడిన సమయంలో చాలా మంది నిద్రమత్తులో ఉన్నారని, రక్షించే అవకాశం లేకపోవటం వల్లే చనిపోయారని గ్రామస్తులు తెలిపారు