Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధవ్ థాకరే రాజీనామా!
తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపుకు సమయం ఆసన్నమయింది.
- By Anshu Published Date - 10:05 PM, Wed - 29 June 22

తాజాగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపుకు సమయం ఆసన్నమయింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే బలపరీక్షకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం రోజున సీఎం ఉద్ధవ్ థాకరే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడానికి ఉంది. ఉద్ధవ్ థాకరే బల పరీక్షకు సంబంధించి శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల దాకా సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.
అయితే దాదాపుగా మూడున్నర గంటల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు అరగంట విరామం తీసుకుని రాత్రి 9 గంటలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తాజాగా సీఎం పదవికి రాజీనామా చేశారు. గురువారం అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతి ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ఉద్ధవ్ థాకరే సీఎంల పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారట. ఇక తాజాగా కేబినెట్ బేటిలోను సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఉద్ధవ్ థాకరే అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం రాజీనామా చేసే బదులుగా ఇప్పుడే తప్పుకుంటే బాగుంటుంది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.