CNG Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గింపు..!
CNG-PNG ధరల్లో పెద్ద ఉపశమనం లభించింది. అదానీ టోటల్ గ్యాస్, మహానగర్ గ్యాస్ ధరలు తగ్గించాయి. సీఎన్‌జీ ధర రూ.8 తగ్గగా, పీఎన్‌జీ ధర రూ.5 తగ్గింది.
- By Gopichand Published Date - 02:00 PM, Sat - 8 April 23

CNG-PNG ధరల్లో పెద్ద ఉపశమనం లభించింది. అదానీ టోటల్ గ్యాస్, మహానగర్ గ్యాస్ ధరలు తగ్గించాయి. సీఎన్‌జీ ధర రూ.8 తగ్గగా, పీఎన్‌జీ ధర రూ.5 తగ్గింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్‌జి ధరను కిలోకు రూ. 8.13, క్యూబిక్ సెంటీమీటర్‌కు రూ. 5.06 తగ్గించింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ శుక్రవారం 19 ప్రాంతాలలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సహజ వాయువు ధరలలో ఈ తగ్గింపు 8 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వచ్చింది.
CNG, PNG ధరలను ఎందుకు తగ్గించారు..!
సహజ వాయువు ధరలకు కొత్త ధరల విధానాన్ని క్యాబినెట్ ప్రకటించిన తరుణంలో సహజ వాయువు ధరలలో ఈ తగ్గింపు వచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ప్రకటన తర్వాత మాత్రమే CNG, PNG ధరలు తగ్గాయి. ఆర్థికవేత్త కిరిత్ పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,155 కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
తగ్గింపు తర్వాత CNG, PNG ధరలు ఎంత..?
MGL నుండి CNG సవరించిన ధర కిలోకు 79 రూపాయలకు, దేశీయ PNG SCMకి 49 రూపాయలగా నిర్ణయించారు. ఇది ఏప్రిల్ 7 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది. ఈ తగ్గింపుతో CNG పెట్రోల్ కంటే 49 శాతం, డీజిల్ కంటే 16 శాతం చౌకగా మారింది. అయితే దేశీయ PNG LPG కంటే 21 శాతం చౌకగా మారింది. అంతకుముందు రోజు కేంద్రం ONGC, ఆయిల్ ఇండియా కోసం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన గ్యాస్ ధరను ఏప్రిల్‌లో USD6.5/mmBtu, ఇతరులకు USD7.92గా నిర్ణయించింది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ క్యాబినెట్ నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ దేశీయ గ్యాస్ ధరను ఇప్పుడు దిగుమతి చేసుకున్న క్రూడ్ ధరతో ముడిపెట్టి, భారత క్రూడ్ ధరలలో 10 శాతానికి సమానమైన ధరను నిర్ణయిస్తామని చెప్పారు. దీనితో పాటు, ప్రతి నెలా దాని ధరలు నిర్ణయించబడతాయి.