Telangana LC: శాసనమండలి చైర్మన్ గా మధుసూదనాచారి
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసారు.
- Author : Hashtag U
Date : 19-12-2021 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసారు.
తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి మదుసూదనా చారితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ ,ఇంద్రకరణ్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,మాజీ శాసన మండలి ఛైర్మన్ ,ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ,తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహ చార్యులు,భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,వరంగల్ రూరల్ జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,వికలాంగులుగా కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి,పలువురు ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు ,మధుసూదనాచారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.