Madhavi Latha : జెసి ప్రభాకర్ రెడ్డి పై ‘మా’కు మాధవీలత ఫిర్యాదు
ఆయన క్షమాపణలు చెప్పినా సరిపోదని, తాను ఆయనపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే సోషల్ మీడియాలో ఒక వీడియో మాధవీ లత రిలీజ్ చేసింది.
- By Latha Suma Published Date - 03:09 PM, Sat - 18 January 25

Madhavi Latha: సినీ నటి మాధవీలత తనను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును శివబాలాజీ అందుకున్నాడు. ఈ మేరకు ప్రెస్ ముందు తన కంప్లైంట్‌ను శివబాలాజీకి మాధవీ లత అందజేసింది. దీంతో ‘మా’ కూడా తనకు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యిందని అర్థమవుతోంది. ఫిర్యాదు చేసే ముందు మాధవీలత తన ఇన్‌స్టాలో ‘న్యాయం కోసం నా పోరాటం’ అని పోస్ట్ పెట్టారు.
ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై, సినీ పరిశ్రమ స్పందించకపోవడం ఆమెకు అసంతృప్తిని కలిగించిందని మాధవిలత అన్నారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి దారుణంగా మాట్లాడారని, సినిమా పరిశ్రమలో సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆయన క్షమాపణలు చెప్పినా సరిపోదని, తాను ఆయనపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే సోషల్ మీడియాలో ఒక వీడియో మాధవీ లత రిలీజ్ చేసింది. మాటలు అదుపులో పెట్టుకోమంటూ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. పైగా జేసీ అన్న మాటలు కరెక్ట్ కాకపోయినా తనకు సపోర్ట్ చేస్తున్నవారిపై కూడా ఫైర్ అయ్యింది.
కాగా, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్నాళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్‌లో మాధవీ లతపై ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. తనను క్యారెక్టర్‌లెస్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మాధవీ లతకు సపోర్ట్‌గా బీజేపీ ముందుకొచ్చింది. మాధవీ లత బీజేపీ ఫాలోవర్ కాబట్టి తనపై ఒక రాజకీయ నాయకుడు అలా ఓపెన్‌గా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ కార్యకర్తలు ఫీల్ అయ్యి జేసీ ప్రభాకర్‌కు కౌంటర్లు ఇచ్చారు. దాంతో మాధవీ లతకు కొంతవరకు ఉపశమనం లభించినా కూడా తాను కూడా ఈ విషయంపై సెలెంట్‌గా ఉండకూడదనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు మొదలుపెట్టింది.
Read Also: RGV Tweet: సత్య సినిమాపై దర్శకుడు ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్