Jagan : జనం ఛీ కొట్టినా.. జగన్ మారడం లేదు – మంత్రి నారా లోకేష్
Jagan : రాష్ట్రంలో వైసీపీ హయాంలో రాజకీయ హింస పెరిగిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
- Author : Sudheer
Date : 15-03-2025 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ మద్దతుదారుల దాడిలో చిత్తూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ (Ramakrishna) మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందిస్తూ.. రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు సురేశ్ గాయపడడంతో, మెరుగైన వైద్యం అందించేందుకు టీడీపీ సహాయంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో రాజకీయ హింస పెరిగిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్ (Jagan) ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన లోకేష్ “జనం ఛీ కొట్టినా జగన్ మారడం లేదు” అంటూ మండిపడ్డారు. గతంలో అనేక హత్యాచారాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలో చోటుచేసుకున్నప్పటికీ, జగన్ లో మార్పు లేదని ఆయన ఆరోపించారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వైసీపీ దాడులకు గురవుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీ రాక్షస పాలనను చూసి, మార్పు కోరుకున్నారని, త్వరలోనే వారికీ తగిన శిక్ష పడుతుందని హెచ్చరించారు.