KTR: కేసుల సంఖ్యను బట్టి ‘లాక్ డౌన్ నిర్ణయం’ ఉంటుంది!
- By Balu J Published Date - 02:33 PM, Fri - 14 January 22

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం ‘ఆస్క్ కేటీఆర్’ ట్విట్టర్ సెషన్‌లో తన అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే. ఆ సెషనల్ లో లాక్‌డౌన్, స్టాండప్ కమెడియన్స్ షో, క్రికెటర్ రిషబ్ పంత్ సెంచరీ వరకు వివిధ అంశాలపై మంత్రి కేటీఆర్ ఓపెన్ అయ్యారు. కోవిడ్ కేసుల పెరుగుతుండటంతో లాక్‌డౌన్, ఇతర చర్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ప్రణాళికల గురించి విక్రాంత్ సింగ్ అనే నెటిజన్ అడిగారు. “ఇది కేసుల సంఖ్య, ఆరోగ్య అధికారులు ప్రభుత్వానికి ఎలా సలహా ఇస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది” అని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సికింద్రాబాద్‌లో అక్రమంగా రోడ్ల మూసివేతకు సంబంధించి అఖిలేష్ రెడ్డి చేసిన ట్వీట్‌పై, ఈ సమస్యను పార్లమెంట్‌లో, ఇతర అన్ని ఫోరమ్‌లలో ఖచ్చితంగా తదుపరి స్థాయికి తీసుకువెళతామని మంత్రి హామీ ఇచ్చారు.
Request @trsharish Garu to look into this https://t.co/ViwToAldk4
— KTR (@KTRBRS) January 13, 2022