Lockdown: తమిళనాడులో లాక్ డౌన్!
- Author : Balu J
Date : 22-01-2022 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జనవరి 16 వ తేదీన(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేసింది. ఈ లాక్ డౌన్ లో అత్యవసరసేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. చెన్నై సెంట్రల్, ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లు, కోయంబేడులోని బస్ టెర్మినస్‌లకు వచ్చే ప్రయాణీకుల ప్రయోజనం కోసం, ఆటోరిక్షా సేవలు, క్యాబ్ సేవల అప్లికేషన్ ఆధారిత రిజర్వేషన్‌లు అనుమతించబడతాయని పేర్కొంది. ఇది రైల్వే స్టేషన్లలో, జిల్లాల్లోని బస్ టెర్మినస్‌లలో వర్తిస్తుందని తెలిపింది.