Mancherial : 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే జీవనం..సాయం కోసం ఎదురుచూపులు
20 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య అనారోగ్యం తో చనిపోయింది..పుట్టిన ఒకే ఒక కుమారుడు తల్లి చనిపోయిన తర్వాత అమ్మమ్మ వద్దకు వెళ్లి అక్కడే పెరిగి పెద్దయ్యాడు
- Author : Sudheer
Date : 26-05-2024 - 6:11 IST
Published By : Hashtagu Telugu Desk
కాసేపు మరుగుదొడ్డిలో ఉండాలంటే అవస్థలు పడుతుంటాం..అలాంటిది 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఆవేదన ఇప్పుడు అందరి చేత అయ్యో అనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్య అనారోగ్యం తో చనిపోయింది..పుట్టిన ఒకే ఒక కుమారుడు తల్లి చనిపోయిన తర్వాత అమ్మమ్మ వద్దకు వెళ్లి అక్కడే పెరిగి పెద్దయ్యాడు..ఇప్పుడు తనను చూసుకునే వారు లేక..ఉండేందుకు ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఈయన బాధను చూసి అయ్యో వారే కానీ సాయం చేసే వారు మాత్రం లేరు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎక్కడా అనుకుంటున్నారా..మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన లింగయ్య(51) కథ.
We’re now on WhatsApp. Click to Join.
లింగయ్య. కుష్ఠు వ్యాధి బాధితుడైన ఆయన, కనీసం పింఛనుకూ నోచుకోక ఇబ్బందులు పడుతున్నాడు. 20 ఏళ్ల క్రితం ఆయన భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించగా, ఏకైక కుమారుడు వారి అమ్మమ్మ వద్ద పెరిగి అక్కడే ఉంటున్నారు. దీంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న లింగయ్య పూరి గుడిసె కూలిపోవడంతో ఇంటి ఆవరణలోని మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకున్నారు. 4 అడుగుల ఆ గదిలో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కావడం తో పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యంతో అన్నం వండుకుని, భిక్షాటనతో కూరలు తెచ్చుకుంటారు. తన దయనీయ స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఇల్లు, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ఈసారైనా ప్రభుత్వం లింగయ్య బాధను అర్ధం చేసుకోం పింఛను , ఇల్లు మంజూరు చేస్తుందో చూడాలి.
Read Also : Telangana : భారీ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర – కేటీఆర్