Libya Floods: లిబియాని ముంచెత్తిన వరదలు.. 11,300 మంది మృతి
లిబియాలో వరదల భీభత్సం కారణంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన నివేదిక ప్రకారం లిబియాలో వరదల కారణంగా ఇప్పటివరకు 11,300 మంది మరణించారు.
- Author : Praveen Aluthuru
Date : 17-09-2023 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
Libya Floods: లిబియాలో వరదల భీభత్సం కారణంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన నివేదిక ప్రకారం లిబియాలో వరదల కారణంగా ఇప్పటివరకు 11,300 మంది మరణించారు. 10,000 మందికి పైగా తప్పిపోయారు. లిబియాలో దర్నాలో అత్యధిక నష్టం వాటిల్లింది. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలు నీటిలో తేలియాడుతున్నాయని. దీంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మృతుల సంఖ్య 20,000 దాటవచ్చని సమాచారం. ఈ విషాదంలో దాదాపు 10,000 మంది తప్పిపోయారు. 40,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది.
డెర్నా నగరానికి సమీపంలో ఉన్న రెండు ఆనకట్టలు తెగిపోవడం వల్ల ఈ వరద ముప్పు వాటిల్లింది. లక్ష జనాభా ఉన్న ఈ నగరాన్ని వరదలు పూర్తిగా నాశనం చేసింది. మరోవైపు అనేక మృతదేహాలు సముద్రంలో కొట్టుకుపోయాయి. సముద్రంలో తేలుతున్న మృతదేహాల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టర్కీ, ఫ్రాన్స్, అల్జీరియా, ఈజిప్ట్, ఇటలీ, ఖతార్ మరియు ట్యునీషియా దేశాలు లిబియాను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. ఫ్రాన్స్ ఫీల్డ్ ఆసుపత్రిని పంపింది. టర్కిష్ రెస్క్యూ బృందాలు కూడా లిబియా చేరుకున్నాయి.ఐక్యరాజ్యసమితి మరియు రెడ్‌క్రాస్ బృందాలు రెస్క్యూ పనిలో నిమగ్నమై ఉన్నాయి.
ఇక ప్రమాదానికి కారణమైన డ్యామ్ పై విచారణ కొనసాగనుంది. నిర్మాణంలో అవినీతి మరియు నిర్లక్ష్యంపై విచారణ జరపాలని లిబియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు డ్యామ్‌ల నిర్వహణ కోసం 2007లో టర్కీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2021లో ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ నివేదికలో 2012, 2013లో డ్యామ్‌ల నిర్వహణకు రూ.16 వేల కోట్లు కేటాయించామని, ఇప్పటికీ ఆ పనులు జరగలేదన్నారు.
Also Read: Northern Railways: 168 ఎలుకలను పట్టుకునేందుకు రూ. 69 లక్షలు ఖర్చు చేసిన రైల్వే శాఖ..!