Happier Life:ఆరోగ్యంగా ఉండాలంటే..వీటికి చోటివ్వండి..!!
ఆరోగ్యం ఎక్కడో లేదు మన చేతిలోనే ఉందన్న విషయం తెలుసుకోవాలి. దీన్ని పట్టించుకోకుండా...మన ఇష్టాలు, కోరికలు, లైఫ్ స్టైల్, క్షణం తీరికలేకుండా ఉండటం ఇలాంటి కారణాలతో మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం.
- By Hashtag U Published Date - 02:18 PM, Sat - 9 April 22

ఆరోగ్యం ఎక్కడో లేదు మన చేతిలోనే ఉందన్న విషయం తెలుసుకోవాలి. దీన్ని పట్టించుకోకుండా…మన ఇష్టాలు, కోరికలు, లైఫ్ స్టైల్, క్షణం తీరికలేకుండా ఉండటం ఇలాంటి కారణాలతో మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. ఆరోగ్య సంరక్షణ అనేది మన చేతుల్లో ఉంటే…దాని పట్ల నిర్లక్ష్యం చేసి…వైద్యుల దగ్గరకు పరుగులేందుకు.? ఇది ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఆరోగ్యం కావాలంటే…రోజువారీలో కొన్నింటికి చోటు ఇవ్వాలి…లేదు…ఇవ్వాల్సిందే…!!
* ప్రతిరోజు కొంత సమయం సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకేలా చూసుకోవాలి. అప్పుడు విటమిన్ డి సహజసిద్ధంగా మన శరీరానికి ఉత్పత్తి అవుతుంది. జీవక్రియల్లో, వ్యాధి నిరోధకశక్తిలో , ఎముకలకు కాల్షియం అందడంలో విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యం.
*ఇక మాంసాహారాన్ని తగ్గించాలి. మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కల ఆధారిత ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
*పది, పదిహేను, 30, 60 నిమిషాలు సమయం ఎంత అయినా పర్వాలేదు. కానీ ఎంతో కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం మర్చిపోవద్దు. ఇంట్లోనే ఉండి కసరత్తులు చేసినా పర్వాలేదు. కానీ వ్యాయామం తప్పకుండా చేయాలి. కంటికి సంబంధించిన వ్యాయామాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా ఆచరించాలి. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామానికి కేటాయించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
* ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం. ఏ సమయానికి తీసుకుంటున్నాం అనేది ఒక రికార్డు నిర్వహించాలి. దీంతో అనారోగ్యానికి గురైనప్పుడు దేనివల్ల జరిగిందన్నది గుర్తించడం సులభం అవుతుంది.
* చక్కెరకు ఎంత దూరం ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. కావాలంటే చక్కరకు ప్రత్యామ్యాయాలుగా తేనె, దాల్చిన చెక్క, స్టీవియాను వాడుకోవచ్చు. చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ముఖ్యంగా సాయంత్రం తర్వాత కెఫైన్ ఉన్న పదార్థాలను తీసుకోరాదు.
* ప్రాణాయామం, ధ్యానం కానీ అలవాటు చేసుకోవాలి. మనస్సుకు నచ్చిన సంగీతం వినాలి. మెదడుకు శక్తి పెరుగుతుంది. ఆఫీసులో లిఫ్టులకు బదులుగా మెట్ల మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇది కూడా ఒక వ్యాయామం.
*ఆహారంలో పీచు పదార్థాలను చేర్చుకోవాలి. కూరగాయాలు ఎక్కువగా తినాలి. రోజుకో పండును తింటే ఎంతో మేలు జరుగుతుంది.
*ఇక చివరిగా కంటినిండా నిద్రపోవాలి. కనీసం 8 గంటలు నిద్రించడం మంచిది. కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి.