HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Leading Nutritionist Recommends Afternoon Naps Heres Why She Calls It A Good Habit

Afternoon Naps:మధ్యాహ్నం కునుకుతో ఎన్నో ప్రయోజనాలు..!!

మధ్యాహ్నం నిద్రపోవాలంటే చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా తిన్న తర్వాత వెంటనే కునుకు తీస్తే బరువు పెరగడంతోపాటు రాత్రిళ్లు నిద్రపట్టదని...

  • By Hashtag U Published Date - 03:03 PM, Wed - 20 April 22
  • daily-hunt
afternoon nap
afternoon nap

మధ్యాహ్నం నిద్రపోవాలంటే చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా తిన్న తర్వాత వెంటనే కునుకు తీస్తే బరువు పెరగడంతోపాటు రాత్రిళ్లు నిద్రపట్టదని…ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయని చాలామంది అనుకుంటుంటారు. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నోఅధ్యయనాలు జరిగాయి. మధ్యాహ్నం కునుకు మంచి ఫలితాలు ఇస్తుందని ఎక్కువ శాతం అధ్యయనాల్లో తేలింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీసినట్లయితే…రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం భోజనంతో బద్ధకం, అధికబరువు, రాత్రినిద్రకు ఆటంకం సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్పుతుండగా…అది నిజం కాదన్నది మెజార్టీ వైద్యులు అభిప్రాయం.

మధ్యాహ్నం భోజనం తర్వాత కలిగే ప్రయోజనాలు..

జీర్ణశక్తి…
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడం ద్వారా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆ సమయంలో శక్తి అంతా జీర్ణక్రియకు వినియోగించుకుంటుంది. దీంతో తీసుకున్న ఆహారం మెరుగ్గా జీర్ణం అవుతుంది. పోషకాలు శరీరం అంతటికీ చేరుతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మలబద్ధకం, చుండ్రు వంటి సమస్యలను కూడా నివారించుకోవచ్చు.

రాత్రి నిద్ర సరిగ్గా పట్టదనే భావన..
లంచ్ తర్వాత కునుకు తీయడం వల్ల రాత్రి నిద్ర ఆలస్యమవుతుందని సరిగ్గా నిద్ర పట్టదన్న అపోహ ఉంది. కానీ నిద్ర సమస్యలకు మధ్యాహ్నం నిద్రం కారణం కానే కాదు. రాత్రి వేళల క్రమబద్దంగా లేకపోకపోయినా..ఆలోచనలు ఎక్కువైనా..శారీరక కదలికలు తగినంత లేకపోయినా…ఒత్తిడి ఎదుర్కొంటున్నా నిద్ర సరిగ్గా పట్టదు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య 30 నిమిషాల పాటు నిద్రించినట్లయితే…సాయంత్రం సమయంలో మోస్తరు వ్యాయామం చేసిన వారికి రాత్రి చక్కటి నిద్ర పడుతున్నట్లు అధ్యయనాల్లో గుర్తించారు.

హార్మోన్లలో సమతుల్యత మెరుగు
హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నవారు మధ్యాహ్నం కొంత సమయం నిద్రించడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది. షుగర్, పీసీఓడి, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు లంచ్ తర్వాత కునుకు అలవాటు చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన

జ్ఞాపకశక్తి
జ్ఞాపకశక్తికి కూడా లంచ్ తర్వాత నిద్ర మేలు చేస్తుంది. మంచి మూడ్ కు సాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే లేదా కొద్ది సమయం తర్వాత ఎడమవైపునకు తిరిగి అర్థగంట పాటు నిద్రించడం సరైనది. నిద్ర రాకున్నా పర్వాలేదు. కళ్లు మూసుకుని పడుకుంటే…ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • afternoon nap
  • nutrition
  • post lunch sleep
  • sleepinh

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd