Lagacharla : హిమాలయాలకు తాకినా లగచర్ల బాధితుల ఆవేదన ..
Lagacharla : లగచర్ల రైతులు మరియు గిరిజన మహిళలకు మద్దతుగా..కొంతమంది యువకులు సముద్ర మట్టానికి 15,419 అడుగుల ఎత్తులో ఉన్న పంగర్చుల్లా శిఖరాన్ని ఎక్కి తమ మద్దతును తెలియజేసారు
- By Sudheer Published Date - 12:42 PM, Thu - 28 November 24

లగచర్ల బాధితుల ఆవేదన హిమాలయాలకు తాకాయి. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో (Lagacharla ) లో ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేయడాన్ని అక్కడి రైతులు , ప్రజలు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా వారంతా ఆందోళన చేస్తూ వస్తున్నారు. తమ భూములు లాక్కొని ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామంటే ఎలా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ కు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి (Attack on collector and officials) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటనకు పాల్పడిన పలువురు నిందితులపై కేసులు నమోదు కావడం, రిమాండ్ కు తరలించడం జరిగింది. అయినప్పటికీ అక్కడి రైతులు తమ ఆందోళలనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజాగా లగచర్ల రైతులు మరియు గిరిజన మహిళలకు మద్దతుగా..కొంతమంది యువకులు సముద్ర మట్టానికి 15,419 అడుగుల ఎత్తులో ఉన్న పంగర్చుల్లా శిఖరాన్ని ఎక్కి తమ మద్దతును తెలియజేసారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతానికి చేరుకోవడానికి వీరికి 3-4 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ విషయాన్నీ మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాద్వారా వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు.
The pain and angst of Lagcherla villagers reached Himalayas
In support of Lagcherla farmers and tribal women who were tortured by the Congress govt in Telangana, young people summitted Pangarchulla peak which is at an altitude of ~15,419 feet from the sea level. Summit was done… pic.twitter.com/xdxTIT2lpW
— KTR (@KTRBRS) November 27, 2024
Read Also : Residential Hostels Issue : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి.. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్