Kuppam : కుప్పం మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ కౌన్సిలర్లు.. కారణం ఇదే..?
కుప్పం మున్సిపల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది.. అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. వైసీపీ
- Author : Prasad
Date : 31-01-2023 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
కుప్పం మున్సిపల్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది.. అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్,, మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ సమక్షంలోనే వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరిస్తూ బయటికి వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో పనులు జరకుండా సమావేశాలు ఎందుకంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిట్స్ బుక్‌ని వైసీపీ కౌన్సిలర్ మునిరాజు చించివేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహంతో ఉన్నారు. మినిట్స్ బుక్ చించివేసిన కౌన్సిలర్ మునిరాజుకు షోకాజ్ నోటీసు జారీ చేయనున్నారు.