HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ktr Public Meeting In Thorrur On The 9th Of This Month

KTR: ఈ నెల 9న తొర్రూరులో కెటిఆర్ స‌భ‌కు భారీ ఏర్పాట్లు

బిఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఈ నెల 9వ తేదీన పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు.

  • Author : Balu J Date : 07-10-2023 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Road Show
Ktr Road Show

KTR: రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, చేనేత‌, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి, బిఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఈ నెల 9వ తేదీన పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న రాక సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. తొర్రూరులో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు, కొడ‌కండ్ల‌లో మినీ టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాప‌న‌, పాల‌కుర్తిలో 17 కోట్ల 50 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించ‌నున్న 50 ప‌డ‌క‌ల వైద్య‌శాల‌కు శంకుస్థాప‌న‌లు కెటిఆర్ చేతుల మీదుగా జ‌ర‌గనున్నాయి. ఇదే సంద‌ర్భంగా తొర్రూరులో 20వేల మందితో భారీగా బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు.

అంత‌కు ముందు 12వేల మందితో తొర్రూరులో భారీగా బైకు ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు శ‌నివారం మంత్రి, తొర్రూరులో గ‌ల ఖ‌మ్మం హై వే రోడ్డు ప‌క్క‌న‌, పాల‌కేంద్రం స‌మీప స్థ‌లాన్ని కలెక్టర్ శశాంక్ తో ప‌రిశీలించారు. అలాగే తొర్రూరు, పెద్ద వంగ‌ర‌, రాయ‌ప‌ర్తి మండ‌లాల్లో ముఖ్య నేత‌లు, పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌ల‌తో మంత్రి స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, 9వ తేదీన మంత్రి కెటిఆర్ రావ‌డానికి అంగీక‌రించారు. వారి చేతుల మీదుగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి.

ఆయా కార్య‌క్ర‌మాల త‌ర్వాత బైకు ర్యాలీ, బ‌హిరంగ స‌భ‌లు ఉంటాయి. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లి రావ‌డానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, కేవ‌లం 20వేల మందితోనే స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. పార్టీ శ్రేణులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. అయితే, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ‌లైన ముఖ్య కార్య‌క్ర‌మాల‌కు కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాప‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇది ఈ ప్రాంత ప్ర‌జ‌లు చేసుకున్న అదృష్టం అని అన్నారు. ఆయా స‌మీక్ష స‌మావేశాల్లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ముఖ్య నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • errabelli dayakar rao
  • ktr
  • public meeting

Related News

Ktrslbc

SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది. సొరంగం పనులను పర్యవేక్షించడంలో విఫలమవడమే కాకుండా, సహాయక చర్యల్లో జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వం కార్మికుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు

  • Errabelli Dayakar Rao

    కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • High Tension In Thorrur Over Municipal Seat Chairman

    తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd