Konda Surekha : బెజవాడలో కోండా సినిమా ప్రమోషన్.. వైఎస్సార్ విగ్రహానికి కొండా సురేఖ నివాళ్లు
- Author : Prasad
Date : 13-06-2022 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ మంత్రి కొండా సురేఖ, దర్శకుడు ఆర్జీవి విజయవాడలో పర్యటించారు. కొండా సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడకు వచ్చామని కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు దెబ్బతిన్నాయని, బీజేపీ వల్లే డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కంట్రోల్‌రూమ్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నుంచి చిత్ర ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం అని.. వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఏపీలో పర్యటన ప్రారంభించామని సురేఖ అన్నారు. తాను ఎప్పుడూ వైఎస్‌ఆర్ అభిమానినేనని, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆమె చెప్పారు. మురళీ ప్రేమకథ, నక్సల్ జీవితం, రాజకీయ జీవిత కథాంశాలతో కొండా చిత్రం ఉంటుందని మాజీ మంత్రి తెలిపారు. రాజకీయాల గురించి మాట్లాడిన ఆమె కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన భూములను తిరిగి టీఆర్‌ఎస్ తీసుకుందని ఆరోపించారు.