Pawan : పవన్ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే బట్టలూడదీసి కొడతాం – కిరణ్ రాయల్
Pawan : పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల(Pawan Kalyan's family members)పై వైసీపీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Rayal) తీవ్రంగా విమర్శించారు
- By Sudheer Published Date - 04:11 PM, Fri - 28 March 25

సోషల్ మీడియా(Social Media)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల(Pawan Kalyan’s family members)పై వైసీపీ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Rayal) తీవ్రంగా విమర్శించారు. తాము దీనిని సహించబోమని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన శ్రేణులు, అభిమానులు దీన్ని తేలికగా తీసుకోరని, పవన్ కళ్యాణ్ పై అనవసర వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.
DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?
“ఇంట్లో వాళ్ల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటే పొరపాటు. తాట తీస్తాం” అని ఆయన హెచ్చరించారు. పవన్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కావాలని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం
ఇలా వ్యాఖ్యలు చేస్తూ జనసేనను ప్రవర్తనలోకి తీసుకురావాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. “మేమే అధికారంలో ఉన్నాం. అయినా అవసరమైతే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తాం. అప్పుడు పరిస్థితి అదుపులో ఉండదు” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయకుండా సామాజిక మాధ్యమాల్లో సమర్థవంతమైన నియంత్రణ పెట్టాలని ఆయన కోరారు.