Model-Actor Found Dead: నటి అనుమానస్పద మృతి…పోలీసుల అదుపులో ఆమె భర్త..!!
కేరళలో ఓ మోడల్ నటి అనుమానస్పదిరీతిలో మరణించింది.
- Author : Hashtag U
Date : 14-05-2022 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
కేరళలో ఓ మోడల్ నటి అనుమానస్పదిరీతిలో మరణించింది. కేరళలోప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరణం వెనకున్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. కేరళలోని కాసరగోడ్ కు చెందిన షహనాది అనే నటి, మోడల్, యాడ్స్ తో కేరళ వాసులకు షహనా సుపరిచితం. యాక్టర్ గా స్థిరపడేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేంది. సంవత్సరం క్రితం వివాహం అయ్యింది. వివాహనంతరం కోజికోడ్కు 14కిలోమీటర్ల దూరంలోని పరాంబిల్ బజార్లో భర్తతో కలిసి ఉంటోంది. ఆకస్మాత్తుగా నిన్న రాత్రి ఆమె మరణించింది. రాత్రి 11.30గంటల సమయంలో అపార్ట్ మెంట్లోని కిటికీ ఊచలకు ఆమె శవమై కనిపించింది. దీనిపై షహనా కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య కాదని హత్యని ఆరోపిస్తున్నారు.
తన భర్త ఎప్పుడూ చిత్రహింసలు పెట్టేవాడని షహనా చెబుతుండేదని ఆమె తల్లి పోలీసులకు విలపించింది. హత్య ఆరోపణల నేపథ్యంలో షహనా భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు.