T-Hub : జూన్ 28 న సీఎం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ-హబ్ ప్రారంభోత్సవం
- Author : Prasad
Date : 26-06-2022 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: జూన్ 28న నూతన టి-హబ్ బిల్డింగ్‌ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టి-హబ్ కొత్త బిల్డింగ్‌ని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేస్తూ “ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రారంభించనుండటం ఆనందంగా ఉందని తెలిపారు. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన టీహబ్.. ఇది భారతదేశపు అతిపెద్ద నమూనా సౌకర్యంగా భావిస్తున్నారు. దీనిని దాదాపు 276 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ భవనంలో 1,500 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉంటాయి. టి-హబ్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది . ఇది ఇప్పటివరకు 1,120 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు హైదరాబాద్‌లో 2,500 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సుమారు రూ. 1,800 కోట్ల పెట్టుబడిని సమకూర్చడంలో సహాయపడింది.