HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kcr Says And Does What He Says Minister Vemula

BRS Minister: కేసిఆర్ చేసేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు: మంత్రి వేముల

 సీఎం కేసిఆర్ చేసేదే చెప్తాడు - చెప్పింది చేస్తాడు అని మంత్రి వేముల స్పష్టం చేశారు.

  • Author : Balu J Date : 05-09-2023 - 6:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prashanth
Prashanth

బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ది పనుల శంకుస్ధాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామంలో బోదెపల్లి అప్రోచ్ బిటి రోడ్ 1కోటి రూపాయలతో సింగిల్ లైన్ నుండి డబుల్ రోడ్ గా మార్చు పనుల శంకుస్థాపన,వన్నెల్ బి గ్రామంలో వన్నెల్ బి లింక్ రోడ్ టు వెంపల్లి రేంజర్ల న్యూ ఫార్మేషన్ రోడ్ 1కోటి వ్యయంతో చేపట్టే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేంజర్ల నుండి షెట్పల్లి వన్నెల్ బి వయా డంపింగ్ యార్డ్ న్యూ ఫార్మేషన్ రోడ్ 2.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనుల శంకుస్థాపన,కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ,హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం,మహిళ బిల్డింగ్ ప్రారంభోత్సవం,సొసైటీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి ఆయా మండలాల ప్రజలు మంగళ హారతులతో,డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. జై కేసిఆర్,జై ప్రశాంత్ అన్న,జై తెలంగాణ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. మళ్ళీ విజయం మీదే అంటూ పలువురు మహిళలు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… సీఎం కేసిఆర్ చేసేదే చెప్తాడు – చెప్పింది చేస్తాడు అని మంత్రి వేముల స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసిఆర్ ఇవ్వడని,పేద ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేస్తాడని అన్నారు. రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్,ఆసరా పెన్షన్లు,24 గంటల ఉచిత విద్యుత్,కుల వృత్తులకు ప్రోత్సాహం,సాగునీరు,సకాలంలో ఎరువులు ఇట్లా ఏ రంగం చూసుకున్నా కేసిఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పథకాలు,అభివృద్ది పనులు చేశారని,దీంతో పేదలకు,రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కెసిఆర్ కంటే గొప్పగా చేస్తామని ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు…ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 200 పెన్షన్ 2వేలు చేసింది కేసిఆర్ అని,కాంగ్రెస్ ఇప్పుడు 4వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడగాలన్నరు.

వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అని రైతును మళ్ళీ గోసపెట్టే కార్యక్రమానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ది ఓర్వని బీజేపీ వాళ్ల పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. స్థానిక ఎంపి బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేశాడని,తాను ఇవాళ పర్యటించిన గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని ప్రశ్నించారు. ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ది,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా జరిగిన లబ్దిని గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు. కాంగ్రెస్,బీజేపీ ల మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. కేసిఆర్ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ది,సంక్షేమ పథకాలతో వచ్చిన మార్పుపై గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలని కోరారు. కేసిఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని,కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల మరోసారి పునరుద్ఘాటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Minister
  • cm kcr
  • Minister Vemula Prashanth Reddy
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

Latest News

  • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

  • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

  • Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

  • Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్‌ఫుల్‌ డ్యాన్స్‌

  • Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd