Bhagavad Gita : విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ…పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత బోధించాలి..!!
కర్నాటక విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విద్యార్థులకు భగవద్గీతను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ సోమవారం ప్రకటించారు.
- By hashtagu Published Date - 04:03 PM, Mon - 19 September 22

కర్నాటక విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విద్యార్థులు భగవద్గీతను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రారంభమయ్యే కొత్త సెషన్‌లో భగవద్గీత అధ్యయనాన్ని చేర్చాలని చెప్పారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సోమవారం శాసనసభలో తెలిపారు. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ, “కొత్త స్టడీ సెషన్‌లో భగవద్గీతను చేర్చాలని మేము ప్లాన్ చేస్తున్నాము. దీని నైతిక విద్య కింద అందించబడుతుంది. ఈ చర్చ కొనసాగుతోంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇవాళ విధాన సభలో బీజేపీ ఎమ్మెల్సీ ఎంకే ఎంకె ప్రాణేష్ విద్యాశాఖ మంత్రిని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.