Karnataka: హిజాబ్ కు నిరసనగా కాషాయ కండువా
- By hashtagu Published Date - 11:41 AM, Wed - 5 January 22

కర్ణాటకలోని కొప్పా జిల్లా లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనలు తెలిపారు. ముస్లిం మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో వివాదం సృష్టించారు. ఎవరు ఏ వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగత నిర్ణయం.. కలిసిమెలసి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో రెచ్చిపోయి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
ఇలాంటి ఘటన మూడు సంవత్సరాల క్రితమే ఒకసారి జరిగిన నేపథ్యంలో కాలేజి యాజమాన్యం స్పందించి హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు ఎవరైనా వారికీ ఇష్టం వచ్చిన వస్త్రాలను ధరించవచ్చు అని అన్నారు. ఈ ఘటన తాజాగా మళ్ళి పునరావృతం కావడం చర్చనీయాంశం అయింది. రాజకీయ నాయకులు వారి రాజకీయ లబ్ధికోసం మత, కుల వివాదాలు సృష్టిస్తుంటారు. అలాంటి వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న యువకులు మత ఛందస్సంతో భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఉత్తర భారత దేశం, దక్షిణ ప్రాంతం లోని కర్ణాటకలో ఇలాంటి ఘటనలు పదేపదే చోటుచేసుకుంటున్నాయి. పిల్లల్లో ఇలాంటి మతవిద్వేషాలు రెచ్చగొట్టకుండా తల్లితండ్రులు జాగ్రత్త తీసుకోవాలి.