HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kane Williamson Stars As Sunrisers Hyderabad Beat Gujarat Titans By Eight Wickets

SRK tames GT: కేన్ మామ అదుర్స్…గుజరాత్ టైటాన్స్ బెదుర్స్..!!

భారీ పరాజయాలతో IPL-2022సీజన్ను ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్...కాస్త లేటుగా అయినా కరెక్టు సమయంలోనే గాడిలో పడినట్లుగా కనిపిస్తోంది.

  • Author : Hashtag U Date : 12-04-2022 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gujarat Titans
Gujarat Titans

భారీ పరాజయాలతో IPL-2022సీజన్ను ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్…కాస్త లేటుగా అయినా కరెక్టు సమయంలోనే గాడిలో పడినట్లుగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ను చిత్తుగా ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్…ఈ మ్యాచ్ లో IPL-2022సీజన్ లో ఓటమి ఎరగని గుజరాత్ టైటన్స్ కు పరాజయాన్ని చూపించింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

163పరుగుల లక్ష్యంతో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. మొదటి వికెట్ కు 64పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ ఔటయ్యారు. 32 బంతుల్లో 6 ఫోర్లతో 42పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ కు క్యాచ్ ఇచ్చాడు. 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 17 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాటియా బౌలింగ్ లో భారీ సిక్ కొట్టాడు. గాయం కారణంగా త్రిపాఠి పెవిలియన్ చేరాడు. అతని స్థానంలో నికోసలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు.

46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశారు కేన్ విలియంసన్, హార్థిక పాండ్యా బౌలింగ్ లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చాడు. ఇప్పటికే SRH విజయానికి 24 బంతుల్లో 34 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆఖరి 3 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి 28 పరుగులు కావాల్సి ఉన్నాయి. లూకీ ఫర్గూసన్ వేసిన 18 వ ఓవర్లో ఒక ఫోర్, సిక్సర్ తో 15 పరుగులు చేశాడు నికోలస్ పూరన్.

దీంతో ఆఖరి 2 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. ఆ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో మ్యాచ్‌ ముగిసింది. నికోలస్ పూరన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. అయిడిన్ మార్క్‌రమ్ 8 బంతుల్లో ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది గుజరాత్ టైటాన్స్. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 162 పరుగులు సాధించింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిసినా మరో ఎండ్‌తో వరుస వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో వైడ్ల రూపంలో ఏకంగా 11 పరుగులు చేశాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికి మాథ్యూ వేడ్ ఫోర్ బాదాడు, ఆ తర్వాతి బంతికి వైడ్ల రూపంలోనే 5 పరుగులు వచ్చాయి. రెండో బంతికి లెగ్ బైస్ లో పరుగు కాగా మూడో బంతి వైడ్‌గా వెళ్లింది. ఐదో బంతికి లైన్ మిస్ అయిన భువీ, 5 వైడ్లు సమర్పించాడు…మొత్తానికి తొలి ఓవర్‌లో 9 బంతులు వేసిన భువీ, ఎక్స్‌ట్రాల రూపంలో 12 పరుగులు ఇచ్చాడు. ఇందులో వైడ్ల రూపంలోనే 11 పరుగులు వచ్చాయి.

IPL- 2022 సీజన్‌లో మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఇంతకుముందు సీఎస్‌కేపై లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చింది. ఇప్పుడు సన్‌రైజర్స్ దాన్ని అధిగమించింది.

 

Trophies and heroes galore for our second win on the bounce. 🧡#SRHvGT #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/Nj4iEoOJ7C

— SunRisers Hyderabad (@SunRisers) April 11, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek Sharma
  • Gujarat Titans
  • Hardik Pandya
  • IPL 2022
  • Kane Williamson
  • Nicholas Pooran
  • Sunrisers Hyderabad

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

    • Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd