Kaikala: సీఎం జగన్ కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ!
- By Balu J Published Date - 01:07 PM, Thu - 20 January 22
ముఖ్యమంత్రి జగన్‌కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సాయం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే మీ అధికారులను మా వద్దకు పంపించి సాయం చేశారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపించిన చొరవ నాకు, నా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందించింది. నటీనటుల సంక్షేమం కోసం మీరు చూపే చొరవ మరోసారి ఈ విధంగా నిరూపితమైంది అని లేఖలో కైకాల సత్యనారాయణ పేర్కొన్నారు.
