HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jobs In Tirumala Tirupathi Devasthanam Full Details Here

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

  • Author : Balu J Date : 27-10-2023 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Temple
Ttd Board Members Meeting under Chairman YV Subbareddy

TTD: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. శాశ్వత ప్రతిపాదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ రిలీజియన్‌కు చెందిన వారు ఈ పోస్టులకు అర్హులని టీటీడీ పేర్కొంది. తగిన విద్యార్హతలు ఉండి, ఇంట్రెస్ట్‌ ఉన్న వారు నవంబర్‌ 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 56 ఉద్యోగాలు ఉండగా, అందులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్) పోస్టులు 27 ఉన్నాయి.

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్) 10, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సివిల్‌) 19 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ, ఎల్ఎంఈ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 42 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏఈఈల నెల వేతనం రూ.57 వేల నుంచి రూ.లక్షా 47 వేలు ఉంటుంది. ఏఈల వేతనం నెలకు రూ.48 వేల నుంచి రూ.లక్షా 37 వేలు ఉంటుంది. ఏటీల నెల వేతనం రూ.37 వేల నుంచి రూ.లక్షా 15 వరకు ఉంటుందని టీటీడీ తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • in Tirumala
  • jobs
  • notifications
  • ttd board

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd