Fire Accident : జేసీ దివాకర్‌రెడ్డికి భారీ నష్టం
Fire Accident : 11కేవి విద్యుత్ లైన్ తెగిపడి బస్సులపై పడడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది
- Author : Sudheer
Date : 02-01-2025 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జెసి దివాకర్ రెడ్డి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు (JC Diwakar Reddy Travels Buses )పార్కింగ్ డిపోలో మంటలు (Fire Accident) చెలరేగాయి. 11కేవి విద్యుత్ లైన్ తెగిపడి బస్సులపై పడడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే మంటలు బస్సులను అంటుకోవడంతో, దట్టమైన పొగ చుట్టుపక్కల విస్తరించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక బస్సు పూర్తిగా దగ్ధమవగా, మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావడం తో భారీ ఆస్థి నష్టం నుండి తప్పినట్లు అయ్యింది. ఈ ఘటనలో కేవలం ఆస్థి నష్టం మాత్రమే వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికుల్లో కొంతకాలం భయాన్నీ, ఆందోళననూ కలిగించినా అధికారులు సమర్థంగా స్పందించారు
ISKCON : చిన్మయ్ కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ